![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -855 లో... రాజ్ నిరాహార దీక్ష చేస్తుంటే.. అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు. మీ భార్యకి మీకు గొడవ ఏంటని అడుగుతారు. అది నా పర్సనల్.. దాని గురించి మీకు అవసరం లేదని రాజ్ ఖచ్చితంగా చెప్పడంతో వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు అక్కడ జరిగేది మొత్తం ఎప్పటికప్పుడు ఇందిరాదేవి తెలుసుకుంటుంది. అపర్ణ కూడా చెప్తుంది.
ఆ తర్వాత కావ్య దగ్గరికి కనకం వచ్చి అల్లుడు గారి ముందు కావాలనే భోజనం చెయ్ అని చెప్తుంది. దాంతో కావ్య వెళ్లి తన ముందు కూర్చొని భోజనం చేస్తుంది రాజ్ టెంప్ట్ అవుతాడు కానీ బయటపడడు. మరొకవైపు అపర్ణ డల్ గా కూర్చొని ఉంటుంది. ఏమైందని సుభాష్ వచ్చి అడుగుతాడు. ఏముంది అక్కడ కొడుకు ఏం తినకుండా నిరాహార దీక్ష చేస్తున్నాడు కదా అని ఇందిరాదేవి చెప్తుంది.
ఆ తర్వాత కృష్ణమూర్తి దగ్గరికి కావ్య వెళ్లి భోజనం తీసుకెళ్ళమని చెప్తుంది. మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఇదంతా అని కృష్ణమూర్తి అంటాడు. ఆ విషయం ఆయన్ని అడగండి అని కావ్య చెప్తుంది. తరువాయి భాగంలో రాజ్ దగ్గరికి కృష్ణమూర్తి వెళ్లి భోజనం ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |